Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

దేశ రాజధాని ఢిల్లీపై అక్కడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో పారిశుధ్ధ్య నిర్వహణ సరిగా లేదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ ప్రపంచ స్థాయి నగరంలా కాకపోయినా కనీసం ఆసియా స్థాయి నగరంలా కూడా లేదని హైకోర్టు ఎద్దేవా చేసింది. పారిశుధ్ధ్యం విషయంలో రాజధాని నగరం చాలా వెనుకబడి ఉందని, చెత్తను తొలగించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని హైకోర్టు విమర్శించింది.

More Telugu News