ప్రముఖ మలయాళ హాస్యనటుడు మాలా అరవిందన్ కన్నుమూత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రముఖ మలయాళ హాస్యనటుడు మాలా అరవిందన్ కన్నుమూత

ప్రముఖ మలయాళ హాస్యనటుడు మాలా అరవిందన్ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఈనెల 19న గుండెపోటుతో కోయంబత్తూరులోని కోవై మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేరారు. ఈ ఉదయం 6.29 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రసిద్ధ రంగస్థల నటుడైన అరవిందన్ మలయాళ సినీ రంగంలో 323 చిత్రాల్లో తన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించారు. మలయాళంలో ప్రేమ్ నజీర్, జయన్, సోమన్, మమ్ముట్టీ, మోహన్ లాల్, దిలీప్ లతో బాటు, ఇప్పటి యువ నటులతో కలిపి మూడు తరాల హీరోలతో ఆయన నటించడం విశేషం.

More Telugu News