టెక్కీల కోసం కొత్త బ్రౌజర్... వివాల్డీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టెక్కీల కోసం కొత్త బ్రౌజర్... వివాల్డీ!

ఇంటర్నెట్ రంగంలో మరో వెబ్ బ్రౌజర్ వచ్చి చేరింది. దీని పేరు వివాల్డీ. సాఫ్ట్ వేర్ రూపకర్త జాన్ వాన్ టెట్ష్ నర్ దీన్ని లాంచ్ చేశారు. స్క్రీన్ పై ఓపెన్ ట్యాబ్ ల విషయంలో సమస్యలు ఎదుర్కొనే వారికి వివాల్డీ పరిష్కారం చూపుతుందని టెట్ష్ నర్ అన్నారు. విండోస్, మాక్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై ఇది పనిచేస్తుంది. మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్ వెర్షన్ అభివృద్ధి దశలో ఉందని టెట్ష్ నర్ తెలిపారు. తమ బ్రౌజర్ తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వివాల్డీలో పర్సనలైజ్డ్ నోట్స్, బుక్ మార్క్స్, స్మాల్ స్క్రీన్ షాట్స్, మల్టిపుల్ గ్రూప్స్, ఫోల్డర్లు వంటి ఫీచర్లున్నాయి. గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, ఆపిల్ సఫారీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ తదితర బ్రౌజర్ల నడుమ వివాల్డీకి కూడా చోటు ఉంటుందని విశ్వసిస్తున్నట్టు టెట్ష్ నర్ తెలిపారు.

More Telugu News