ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ కు షరపోవా... టైటిల్ కు చేరువైన రష్యన్ బ్యూటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ కు షరపోవా... టైటిల్ కు చేరువైన రష్యన్ బ్యూటీ

టెన్నిస్ అందాల సుందరి మరియా షరపోవా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో దూసుకెళుతోంది. కొద్దిసేపటి క్రితం ముగిసిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించిన ఈ సుందరి, టైటిల్ రేసులో మరో అడుగు ముందుకేసింది. క్వార్టర్ ఫైనల్ లో భాగంగా ఏడో సీడ్ బౌచర్డ్ పై 6-3, 6-2 స్కోరుతో అలవోకగా విజయం సాధించిన షరపోవా సెమీస్ లో అడుగుపెట్టింది. సెమీస్ లో షరపోవా... ఎక్తరీనా మకరోవాతో తలపడనుంది. 2008లో షరపోవా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సింగిల్స్ టైటిల్ నెగ్గింది.

More Telugu News