కేజ్రీవాల్ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారు: కిరణ్ బేడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేజ్రీవాల్ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారు: కిరణ్ బేడీ

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడని బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌ బేడీ విమర్శించారు. "తనకు ఆహ్వానం అందలేదని కేజ్రీవాల్ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఆయన ఇంకా ఎదగాల్సిన అవసరముంది. ఆహ్వానాలు... కోరుకుంటేనో, డిమాండ్ చేస్తేనో రావు. నిబంధనలు, ప్రొటోకాల్స్‌ కు అనుగుణంగా వస్తాయి" అన్నారు. కాగా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కేజ్రీవాల్ ‌కు ఆహ్వానం పంపకపోవడాన్ని ఆప్ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని కూడా రాజకీయం చేసిందని ఆ పార్టీ నేత యోగేందర్‌ యాదవ్ ఆరోపించారు. వేడుకల్లో కిరణ్‌ బేడీ వైపు కెమెరాలను ఎక్కువగా ఫోకస్ చేయడం ద్వారా ఈ విధంగా కూడా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. ప్రజలు, ఎన్నికల కమిషన్ కూడా దీన్ని గమనించినట్టు తెలిపారు.

More Telugu News