Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యుత్ షాక్... వెనువెంటనే గ్యాస్ సిలిండర్ల పేలుడు... పరుగులు పెట్టిన ముదినేపల్లి వాసులు

కృష్ణా జిల్లాలో విద్యుత్ షాక్, వెనువెంటనే గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు జరిగాయి. జిల్లాలోని ముదినేపల్లిలో నేటి ఉదయం విద్యుత్ షాక్ తో మూడు ఇళ్లకు నిప్పంటుకుంది. ఈ క్రమంలో సదరు ఇళ్లల్లోని రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే వెంటవెంటనే జరిగిన రెండు ప్రమాదాలలో మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ధీంతో రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబాలు చెప్పాయి.

More Telugu News