దొంగల కోసమెళితే... బాల కార్మికులు బయటపడ్డారు: పాతబస్తీలో దారుణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దొంగల కోసమెళితే... బాల కార్మికులు బయటపడ్డారు: పాతబస్తీలో దారుణం

నేరాల అదుపులో భాగంగా హైదరాబాదు పోలీసులు చేపట్టిన కార్డాన్ అండ్ సెర్చ్ సోదాల్లో నేటి తెల్లవారుజామున వెట్టి చాకిరీ ఉదంతం వెలుగు చూసింది. నగరంలోని పాతబస్తీ పరిధికి చెందిన భవానీ నగర్ లో నేటి తెల్లవారుజామున సౌత్ జోన్ పోలీసులు ముమ్మర సోదాలకు దిగారు. ఈ సందర్భంగా వెట్టి చాకిరీలో మగ్గుతున్న 250 మంది బాలలు పోలీసుల కంటబడ్డారు. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు పూర్తి వివరాలు రాబట్టేందుకు రంగంలోకి దిగారు. వీరంతా బీహార్ కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. పిల్లలను అక్రమంగా తరలించడంతో పాటు వారితో బలవంతంగా వెట్టి చాకిరీ చేయిస్తున్న ముఠా ఉదంతం ఈ సందర్భంగా వెలుగుచూసింది. బీహార్ నుంచి తీసుకువచ్చిన పిల్లలతో కొందరు వ్యక్తులు గాజుల తయారీ, దుస్తుల డిజైన్ పరిశ్రమల్లో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. బాలల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కొన్ని సంస్థలపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, బాలలను అక్రమంగా తరలించిన వారి కోసం గాలింపు చేపట్టారు.

More Telugu News