Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీసీసీఐ కావాలా? చెన్నై సూపర్ కింగ్స్ కావాలా?... తేల్చుకోమని శ్రీనివాసన్ కు సుప్రీంకోర్టు ఆదేశం

అటు బీసీసీఐ చైర్మన్ గా, ఇటు చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా ఉండేందుకు శ్రీనివాసన్ కు అర్హత లేదని ఏదో ఒక పదవిలోనే ఉండాలని, ఏది కావాలో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో తీర్పు సందర్భంగా ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన్ను ఒక్క పదవికే పరిమితం కావాలని సూచించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటారా? లేదా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమానిగా ఉంటారా? అని ప్రశ్నించింది. ఐపీఎల్ జట్టును కొనుక్కునేందుకు బీసీసీఐ మార్గదర్శకాలను సవరించడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. కాగా, బీసీసీఐ పదవిపై మక్కువతో ఉన్న శ్రీనివాసన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే, ఐపీఎల్ పాలన వ్యవహారాలకు, చెన్నై టీంకు దూరంగా ఉంటానని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

More Telugu News