Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లారీలో భారీగా పేలుడు పదార్థాలు... ఖమ్మంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఖమ్మం జిల్లా పోలీసులు నేటి ఉదయం ఓ లారీలో భారీ సంఖ్యలో తరలివెళుతున్న పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు మండలం మొరంపల్లి వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు, ఓ లారీలో భారీ సంఖ్యలో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా సదరు పేలుడు పదార్థాలు అక్రమంగానే తరలివెళుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

More Telugu News