Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూరియా బ్లాక్ మార్కెటింగ్ పై రైతుల కన్నెర్ర... అనంతసాగరంలో ఉద్రిక్తత

నల్ల బజారుకు తరలిపోతున్న యూరియా ఉదంతంపై రైతులు కన్నెర్రజేశారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వైనంపై నిరసన వ్యక్తం చేయడమే కాక సదరు కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో సొసైటీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రైతులను నిలువరించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ సందర్భంగా రైతులు కూడా పోలీసులు, అధికారులపైకి తిరగబడ్డారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో రైతుల ఆందోళన, పోలీసుల లాఠీచార్జీతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

More Telugu News