Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిధులు దుర్వినియోగం అయితే ఖబడ్దార్... పంచాయతీ కార్యదర్శులకు కేటీఆర్ హెచ్చరిక

సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధిలో గ్రామ కార్యదర్శుల పాత్రే అత్యంత కీలకమని టీఎస్ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు సేవచేయాలని గ్రామ కార్యదర్శులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాదులో తెలంగాణ గ్రామపంచాయతీ కార్యదర్శుల డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ కార్యదర్శుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందని... నిధులు దుర్వినియోగం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More Telugu News