ఒబామాకు అంత భద్రతా... మన ప్రజలకు కల్పించరేం?: ప్రశ్నించిన హైకోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒబామాకు అంత భద్రతా... మన ప్రజలకు కల్పించరేం?: ప్రశ్నించిన హైకోర్టు

ఒబామా రాక సందర్భంగా భారత చరిత్రలో ఎన్నడూ లేనంత భద్రతా ఏర్పాట్లు చేస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఆయన భద్రతకు 15 వేల సీసీ టీవీలను ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావిస్తూ, అంత భద్రతను ప్రజలకు ఎందుకు కల్పించరని జస్టిస్ బదార్ దురేజ్ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్ దేవాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. అంత భద్రత ఆయనకు అవసరమా? అని అడిగింది. నిర్భయ ఉదంతం తరువాత దేశ రాజధానిలో మహిళల భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు కోర్టుకు ఇచ్చేందుకు అమికస్ క్యూరీగా మీరా భాటియాను నియమించిన సంగతి తెలిసిందే. నేడు కోర్టుకు సీసీ టీవీ కెమెరాలతో ఒబామాకు భద్రతా ఏర్పాట్ల విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

More Telugu News