Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకయ్య ఇంట్లో సంక్రాంతి సంబరాలు... ఎంజాయ్ చేసిన ప్రధాని, కేంద్ర మంత్రులు!

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో నేటి మధ్యాహ్నం జరిగిన ఈ వేడుకలకు పలువురు కేంద్ర మంత్రులతో పాటు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వెంకయ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలుగు సంక్రాంతి వేడుకలను మంత్రులు, పార్టీ ప్రముఖులు బాగానే ఎంజాయ్ చేశారట. ఈ వేడుకలకు హాజరైన వారిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, సురేష్ ప్రభు తదితరులున్నారు.

More Telugu News