ముస్లిం దేశంలో హిందూ చీఫ్ జస్టిస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముస్లిం దేశంలో హిందూ చీఫ్ జస్టిస్

ముస్లిం దేశంలో హిందూ చీఫ్ జస్టిస్ నియామకం జరిగింది. ముస్లింలు అత్యధికంగా ఉండే బంగ్లాదేశ్ లోని అత్యున్న న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ కే సిన్హా (64)ను ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ నియమించారు. ఈ మేరకు సిన్హా అధ్యక్ష భవనంలో జనవరి 17న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగే అవకాశం ఉంది. ఎస్ కే సిన్హా బంగ్లా బంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రహ్మాన్ హత్య కేసుతో పాటు 5వ, 13వ రాజ్యాంగ సవరణలపై కీలకమైన తీర్పులు ఇచ్చారు.

More Telugu News