Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోల్ కతా రైల్వే స్టేషన్ సమీపంలో నాటుబాంబు పేలుడు...ఇద్దరికి గాయాలు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నాటుబాంబు పేలుడు కలకలం రేపింది. కోల్ కతాలోని డమ్ డమ్ రైల్వే స్టేషన్ వద్ద నాటు బాంబు పేలింది. ఈ పేలుడులో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసులు మరో మూడు నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News