ఎల్లుండి జమ్ము కాశ్మీర్ గవర్నర్ ను కలవనున్న పీడీపీ అధ్యక్షురాలు
జమ్ము, కాశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీడీపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 31న ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాతో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు గెలుచుకుని అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా నిలిచింది.
దీంతో, 25 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచిన బీజేపీతో పొత్తు పెట్టుకుని, అధికారం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుండగా, బీజేపీకి మంత్రి వర్గంలో ప్రాముఖ్యతనిస్తారని సమాచారం. దీంతో జమ్మూకాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై ఓ స్పష్టత వచ్చింది.