జావా సముద్రంలో కొన్ని విమాన శకలాల గుర్తింపు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జావా సముద్రంలో కొన్ని విమాన శకలాల గుర్తింపు!

ఎయిర్ ఏషియా విమానం కోసం జావా సముద్రంలో జరుపుతున్న గాలింపు చర్యల్లో కొన్ని శకలాలను గుర్తించినట్టు ఇండోనేషియా అధికారి ఒకరు తెలిపారు. నంగ్కా దీవికి 100 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో తేలియాడుతున్న కొన్ని అనుమానిత వస్తువులను ఆస్ట్రేలియా ఓరియన్ ఎయిర్ క్రాఫ్ట్ కనుగొన్నట్టు జకార్తా ఎయిర్ ఫోర్స్ బేస్ కమాండర్ రియర్ మార్షల్ ద్వి పుత్రానొ చెప్పారు. ఈ మేరకు ప్రకటన చేశామని తెలిపారు. కాగా, ఆ శకలాలు అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానానికి చెందినవా? కాదా? అని ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రస్తుతం ఇంకా సముద్రంలో గాలింపు కొనసాగుతూనే ఉంది.

More Telugu News