ములాయంసింగ్ కనబడుటలేదు, తీసుకొచ్చిన వారికి నగదు పురస్కారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ములాయంసింగ్ కనబడుటలేదు, తీసుకొచ్చిన వారికి నగదు పురస్కారం!

అజంఘర్ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ 'కనిపించడంలేదు', సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు సహా ఎవరైనా ఆయన్ను తన నియోజకవర్గానికి తీసుకురావాలని బీజేపీ ఓ ప్రకటన చేసింది. తీసుకొచ్చిన వారిని నగదు పురస్కారంతో సన్మానం చేస్తామంటూ ములాయం ఫొటోతో పోస్టర్లను ముద్రించింది. బీజేపీ మైనారిటీ వింగ్ చేస్తున్న ఈ ప్రచారం అజంఘర్ ప్రాంతంలో చిన్నపాటి కలకలం రేపుతోంది. సఘ్రీ తెహసిల్, చుట్టుప్రక్కల ప్రాంతాలలో పోస్టర్లను అంటించామని, ములాయంను అజంఘర్ కు తీసుకొచ్చిన ఎవరికైనా నగదు అందజేస్తామని కూడా ప్రకటించామని బీజేపీ మైనారిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు సోఫియా ఖాన్ చెప్పారు. వారణాసికి అప్పటి ప్రధానమంత్రి మంత్రి అభ్యర్థి నరేంద్రమోదీ బయటి వ్యక్తని ఎన్నికల సమయంలో ములాయం వ్యాఖ్యానించారని, కానీ గెలిచాక ప్రధాని హోదాలో ఉండి కూడా మూడుసార్లు ఆ ప్రాంతంలో పర్యటించారని ఖాన్ అన్నారు. ఓ ఎంపీ అయిన ములాయం తన నియోజకవర్గ ప్రజలను పట్టించుకునేందుకు సమయమే కేటాయించడం లేదన్నారు. ఇప్పుడో బయటి వ్యక్తిలా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో మణిపురి, అజంఘర్ స్థానాలకు పోటీచేసిన ఎస్పీ అధినేత విజయం సాధించారు. తరువాత మణిపురి స్థానానికి రాజీనామా చేసి అజంఘర్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.

More Telugu News