ఆసీస్ కు 'థాంక్స్' చెబుతున్న కోహ్లీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసీస్ కు 'థాంక్స్' చెబుతున్న కోహ్లీ

టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియన్లకు 'థాంక్స్' చెబుతున్నాడు. మెల్ బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తన భారీ సెంచరీకి వారే కారణమన్నాడు. ఆసీస్ ఆటగాళ్లు ఉపయోగించిన పరుష పదజాలం తనలో పట్టుదల రగిల్చిందని, ఆ క్రమంలోనే తాను 169 పరుగులు చేశానని తెలిపాడు. మూడో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "వారు నన్ను చెడ్డ బాలుడంటున్నారు. 'నేనింతే' అని బదులిచ్చాను. నన్ను ద్వేషిస్తారని తెలుసు, అదే నాకిష్టం. ఆసీస్ పై ఆడడాన్ని ఎంతగానో ఆస్వాదిస్తాను. మాట్లాడకుండా ఉండడం వారికి కష్టమైన పని. వారి మాటలు నాలోని అత్యుత్తమ ఆటతీరును బయటికి తెస్తాయి. వారికి ఈ విషయం అర్థమవుతున్నట్టు కనిపించడం లేదు" అని వివరించాడు. ఇక, పేసర్ మిచెల్ జాన్సన్ తో మాటల యుద్ధం గురించి చెప్పాడు. శరీరానికి గురిపెట్టి బంతులు విసరడం సరికాదని అతనితో చెప్పానని కోహ్లీ తెలిపాడు. జాన్సన్ బౌలింగ్ తీరు చికాకుపెట్టిందని అన్నాడు.

More Telugu News