హైదరాబాదీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాపై ఐసీసీ వేటు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాపై ఐసీసీ వేటు!

నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ టీమిండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాపై ఐసీసీ నిషేధం విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలింగ్ చేస్తున్న సమయంలో మోచేతిని 15 డిగ్రీలు మాత్రమే వంచాల్సి ఉంది. అయితే అంతకంటే ఎక్కువగా ఓజా తన మోచేతిని వంచుతున్నాడని చెన్నైలోని టెస్టింగ్ సెంటర్ నిపుణులు తేల్చారు. దీంతో అతనిపై నిషేధం విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ నిర్ణయంతో హైదరాబాద్ రంజీ జట్టు నుంచి ఓజా తప్పుకోవాల్సి వచ్చింది. వేగంగా వంద వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో చోటు సాధించిన ఓజా కెరీర్, ఐసీసీ నిర్ణయంతో సందిగ్ధంలో పడింది. ఏడాది పాటుగా కాంపిటీటివ్ క్రికెట్ కు దూరంగా ఉంటూనే తన బౌలింగ్ శైలి సరైనదేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. దేశవాళీ క్రికెట్ లో భాగంగా భారత అంపైర్ ఏవీ జయప్రకాశ్, ఓజా బౌలింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐసీసీ విచారణ చేపట్టింది.

More Telugu News