Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేవంత్ రెడ్డిని అడ్డుకున్న ఎమ్మార్పీఎస్... తెలుగు తమ్ముళ్లతో బాహాబాహీ

నేటి మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, రమణలను వారు ఘెరావ్ చేయడంతో, టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తీర్మానం చేయలేదని ఆరోపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అక్కడి కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. దీంతో, తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగి ఎమ్మార్పీఎస్ నాయకులపై దాడి చేసి, వారిని కొట్టారు. ఈ ఘటనలో కొందరు పోలీసులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు 30 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

More Telugu News