ఒబామా ఒక కోతి... ఉత్తర కొరియా మండిపాటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒబామా ఒక కోతి... ఉత్తర కొరియా మండిపాటు

సోనీ పిక్చర్స్ పై జరిగిన సైబర్ దాడుల అనంతరం అమెరికా, ఉత్తర కొరియాల మధ్య అంతరం రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఉత్తర కొరియాకు ఇంటర్నెట్ సేవలను అమెరికా నిలిపివేయగా, ఒబామా 'ఓ కోతి', ఆయనవి కోతి చేష్టలు అని ఆ దేశం వ్యాఖ్యానించింది. సోనీ పిక్చర్స్ పై దాడుల్లో ప్రభుత్వ పాత్ర ఉన్నదని వస్తున్న విమర్శలను ఖండించింది. సోనీ తీసిన 'ది ఇంటర్వ్యూ'లో తమ నేత కిం జోంగ్ ఉన్ హత్యను హాస్యపూర్వకంగా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమా విడుదల వాయిదా వేయాలని సోనీ నిర్ణయించగా, ఒబామా ప్రోద్బలంతోనే చిత్రం విడుదలైందని కొరియా పోలీసు అధికారి ఒకరు ఆరోపించారు. ఈ చిత్రం చట్ట వ్యతిరేకమని, నిజాయతీతో తీయలేదని, ప్రతీకార చర్యలను ప్రోత్సహించేదిగా ఉందని విమర్శించారు.

More Telugu News