ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు... ఆలస్యంగా నడుస్తున్న 50 రైళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు... ఆలస్యంగా నడుస్తున్న 50 రైళ్లు

ఈ సీజన్ లో రెండవ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన నగరంగా ఢిల్లీ రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం దేశ రాజధానిలో 4.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. దట్టంగా ఏర్పడిన పొగమంచు కారణంగా ఉత్తర దిశగా వెళ్లే 50 రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైళ్ల బయలుదేరు సమయాన్ని రీషెడ్యూల్ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, మంచు కారణంగా ఫ్లైట్స్ రద్దు చేయడంగానీ, రూట్స్ మార్చడంగానీ జరగడం లేదట. ఈ సీజన్ లో ఈ నెల 22న ఢిల్లీలో తొలిసారి 4.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

More Telugu News