అన్నంత పనీ చేసిన ఏపీ ప్రభుత్వం... పేదల ఇంట సంక్రాంతి కొర్రి!
ఆధార్ కార్డు వివరాలు ఇవ్వని కుటుంబాలకు జనవరి నుంచి రేషన్ నిలిపేస్తామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నంత పనీ చేసింది. దీంతో పండుగ నెలలో లక్షకు పైగా కుటుంబాలకు రేషన్ అందే పరిస్థితి లేదు. తాము పంపిన జాబితా మేరకే రేషన్ సరుకులను ఇవ్వాలని అధికారులు రేషన్ డీలర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. కుటుంబంలో నలుగురు సభ్యులున్నప్పుడు అందులో ఒకరికి ఆధార్ లేకపోయినా మిగతా వారికి కూడా సరుకులు నిలిపివేయనున్నారు. అధికారుల నిర్ణయాన్ని డీలర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ఆయా రేషన్ కార్డుదారులకు తాము ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు.