వగల మాటలొద్దు... అసలు మాటలు మాట్లాడు: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సూచన
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ‘‘వగల మాటలొద్దు... అసలు మాటలు మాట్లాడండి’’ అంటూ కేసీఆర్ కు సూచించారు. ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీస్తున్న తమ పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకరరావులను దూషించడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలి గాలిమరలపై తిరుగుతున్నారంటూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.