శ్రీకాకుళం జడ్పీ వద్ద ఉద్రిక్తత...పోలీసుల అడ్డగింతతో ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశాలకు వస్తున్న తనను అడ్డుకున్న పోలీసుల వైఖరికి నిరసనగా పలాస టీడీపీ ఎమ్మెల్యే శివాజీ అక్కడే నిరసనకు దిగారు. కొద్దిసేపటి క్రితం జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరయ్యేందుకు వస్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో శాంతించని ఆయన జడ్పీ సమావేశ మందిరం బయట నిరసనకు దిగడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.