ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదికగా హైదరాబాద్
హైదరాబాద్ నగరానికి మరో గౌరవం దక్కింది. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ కు ఈ చారిత్రక నగరం వేదిక కానుంది. 2018లో ఈ సదస్సు హైదరాబాదులో జరగనుంది. రెండోళ్లకోసారి ఈ సదస్సు జరుగుతుంటుంది. ఆసియా దేశాల్లో చివరిసారిగా కౌలాలంపూర్ లో 2008లో ఈ సదస్సును నిర్వహించింది. అంటే, 10 ఏళ్ల తర్వాత ఆసియా ఖండానికి మరో చాన్స్ దక్కిందన్నమాట. సాధారణంగా ఈ సదస్సు నిర్వహణకు ఎనలేని పోటీ ఉంటుంది. యూరప్ దేశాలతో పోటీపడిన భారత్ 2018లో సదస్సును నిర్వహించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సదస్సు నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందనుంది.