కొలంబియాలో విమానం కూలి ఏడుగురి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొలంబియాలో విమానం కూలి ఏడుగురి మృతి

కొలంబియాలో విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మరణించారు. కొలంబియా ఈశాన్య రాష్ట్రం బుకారమంగ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కూలిపోయిందని ఆ దేశ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో నలుగురు మహిళలున్నారు. విమాన శకలాలు పర్వత ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. అయితే ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం నేపథ్యంలోనే ప్రమాదం సంభవించి ఉంటుందని తెలుస్తోంది. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది.

More Telugu News