బాక్సిండ్ డే టెస్టులో ఆదిలోనే ఆసిస్ వికెట్ పడింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాక్సిండ్ డే టెస్టులో ఆదిలోనే ఆసిస్ వికెట్ పడింది!

భారత్, ఆస్ట్రేలియాల మధ్య కొద్దిసేపటి క్రితం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆదిలోనే ఆసిస్ కు ఉమేశ్ యాదవ్ షాకిచ్చాడు. తాను వేసిన తొలి ఓవర్ లోనే ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ ను పడగొట్టాడు. ఉమేశ్ విసిరిన బంతిని ఆడబోయిన వార్నర్, శిఖర్ ధావన్ చేతికి చిక్కాడు. దీంతో జట్టు స్కోరు 2 పరుగుల వద్ద ఉండగానే ఆసిస్ తొలి వికెట్ ను కోల్పోయింది. 19 ఓవర్లు ముగిసేసరికి ఆసిస్ 73 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ జార్జి (38), షేన్ వాట్సన్ (34) క్రీజులో కొనసాగుతున్నారు.

More Telugu News