నడి రోడ్డుపై టీడీపీ ఎంపీటీసీ హత్య
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నాలుగో వార్డు తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ కోళ్ల అప్పన్న (42)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కత్తులతో నరికి చంపేశారు. మండపాలెం కాలనీలో భూవివాదాన్ని పరిష్కరించాలని ఎవరో ఫోన్ చేయడంతో అప్పన్న అక్కడకు ఒంటరిగా బయలుదేరారు. ఈ సమయంలో దాడి చేసిన దుండగులు హత్యకు పాల్పడ్డారు. గత నెలలో జరిగిన ఓ రౌడీషీటర్ హత్య కేసులో అప్పన్న నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనకు, అప్పన్న హత్యకు మధ్య లింక్ ఏమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.