గచ్చిబౌలిలో అర్ధరాత్రి టిప్పర్ బీభత్సం...15 కార్లు ధ్వంసం
హైదరాబాదులో ఓ టిప్పర్ మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకువచ్చిన టిప్పర్ అదుపు తప్పి రోడ్డు పక్కగా పార్కు చేసిన కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే టిప్పర్ దూసుకువచ్చిన సమయంలో కార్లలో ఎవరూ లేని కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది. అతివేగంగా టిప్పర్ ఢీకొన్న నేపథ్యంలో కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ ను అక్కడే వదిలేసిన డ్రైవర్ పరారయ్యాడు.