ఆల్ రౌండర్ అఫ్రిదికి షోకాజ్ నోటీసులు పంపిన పీసీబీ
పాకిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి సొంత బోర్డు నోటీసులు పంపింది. నియమావళికి వ్యతిరేకంగా కమర్షియల్ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పుబట్టింది. ఈ క్రమంలో అఫ్రిదితోపాటు మరో నలుగురు క్రికెటర్లకు షోకాజ్ నోటీసులు పంపారు. వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు క్రికెటర్లు అనుమతి తీసుకోలేదని పీసీబీ పేర్కొంది. కాగా, నోటీసులు అందుకున్న వారిలో మహ్మద్ ఇర్ఫాన్, వహాబ్ రియాజ్, అన్వర్ అలీ, ఫవాద్ ఆలం ఉన్నారు.