సోన్వార్ లో ఒమర్ అబ్దుల్లా ఓటమి... అనంత్ నాగ్ లో ముఫ్తీ గెలుపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోన్వార్ లో ఒమర్ అబ్దుల్లా ఓటమి... అనంత్ నాగ్ లో ముఫ్తీ గెలుపు

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక పక్షానికి ప్రజలు షాకిచ్చారు. అదే సమయంలో విపక్ష పీడీపీ సహా బీజేపీకి పట్టం కడుతున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోన్వార్ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను ముందే ఊహించిన ఒమర్ అబ్దుల్లా సోన్వార్ తో పాటు బీర్వా నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగారు. ఈ రెండు నియోజకవర్గాలూ కాశ్మీర్ లోయకు చెందినవే. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో సోన్వార్ లో ఓటమిపాలైన అబ్దుల్లా, బీర్వాలో కూడా ఓడిపోయే అవకాశాలున్నాయి. మరోవైపు పీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహ్మద్ సయీద్ అనంత్ నాగ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

More Telugu News