శ్రీవారి సేవలో అల్లు వారి కుటుంబం
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం నేడు శ్రీవారి సేవలో పాల్గొంది. తండ్రి అల్లు అరవింద్, భార్య స్నేహ, కుమారుడు అయాన్, మరికొందరు కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. వెంకన్న దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన అల్లు వారి కుటుంబాన్ని చూసేందుకు ప్రజలు పోటీలు పడ్డారు.