టెక్ మహీంద్రాలో 30 వేల కొత్త కొలువులు
ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ టెక్ మహీంద్రా వచ్చే రెండేళ్లలో 30,000 మందిని విధుల్లోకి తీసుకోనుంది. ప్రధానంగా హైదరాబాదుతో పాటు బెంగళూరు, పుణే, వైజాగ్, జైపూర్, భువనేశ్వర్ కేంద్రాల్లో కొత్త ఉద్యోగాలు ఇస్తామని సంస్థ ఎండీ సి.పి.గుర్నాణి తెలిపారు. ఈ నియామకాల తర్వాత టెక్ మహీంద్రా ఉద్యోగుల సంఖ్య 1.25 లక్షలకు పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం వైజాగ్లో సుమారు 1,500 మంది పనిచేస్తున్నారని, కొత్తగా స్థల కేటాయింపులు పూర్తయ్యాయని వివరించారు. హైదరాబాదుకు సమీపంలోని బహదూర్పల్లిలో ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటుకు సుమారు రూ.600 కోట్ల మొత్తాన్ని వెచ్చించినట్లు ఆయన తెలిపారు.