నేడు 'పీకే' చిత్రాన్ని చూడనున్న కేజ్రీవాల్
విడుదలైన రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేస్తున్న ఆమిర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే'పై సామాన్య ప్రేక్షకులే కాక ప్రముఖులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ చిత్రాన్ని వీక్షించారు. ఇప్పుడు ఢిల్లీ రాజకీయ సంచలనం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ చిత్రంపై ఆసక్తి కనబరుస్తున్నారు.
‘‘పీకే చూశారా? ఎలా ఉంది? రేపు నేను ఈ చిత్రాన్ని చూసేందుకు ప్లాన్ చేసుకున్నా’’ అని ఆయన నిన్న ట్విట్టర్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో కేజ్రీవాల్ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు అవసరమయ్యే నిధుల కోసం ఆయన కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతున్నారు. అయినా కాస్త తీరిక చేసుకున్న కేజ్రీవాల్ నేడు పీకేను చూస్తారట. మరి పీకేను చూసిన తర్వాత ఆయన ఏ విధమైన కామెంట్లు చేస్తారో చూద్దాం.