4,200 కోట్లు సమీకరించుకున్న ఫ్లిప్ కార్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

4,200 కోట్లు సమీకరించుకున్న ఫ్లిప్ కార్ట్

నిధుల సమీకరణలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్ దూకుడు ప్రదర్శస్తోంది. మరిన్ని నిధులను సేకరించిన ఫ్లిప్ కార్ట్, తాజా సేకరణతో షేర్ హోల్డర్ల సంఖ్య 50కి మించిపోయింది. వివిధ సంస్థల నుంచి తాజాగా మరో 70 కోట్ల డాలర్లను (సుమారు రూ. 4,200 కోట్ల రూపాయలు) సమీకరించింది. 50 మంది షేర్ హోల్డర్ల పరిమితిని చేరుకోవడంతో, సింగపూర్‌ లో పబ్లిక్ కంపెనీగా నమోదు చేసుకునేందుకు ఫ్లిప్ కార్ట్ కసరత్తు ప్రారంభించింది. దీన్లో భాగంగా సింగపూర్ కంపెనీల నియంత్రణ సంస్థ (ఏసీఆర్‌ఏ)కి దరఖాస్తు చేసుకుంది. అయితే, వీటిని పబ్లిక్ ఇష్యూ సన్నాహాలుగా భావించరాదని ఫ్లిప్‌ కార్ట్ తెలిపింది. తాజాగా సేకరించిన నిధులను భారత్‌ లో దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడుల కోసం వినియోగించనున్నామని ఫ్లిప్ కార్ట్ స్పష్టం చేసింది.

More Telugu News