Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇషాంత్, ఆసీస్ జట్టుకు జరిమానా

ఆస్ట్రేలియాతో గబ్బా స్టేడియంలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకుగాను భారత బౌలర్ ఇషాంత్ శర్మకు రిఫరీ జరిమానా విధించారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పట్ల ఇషాంత్ అనుచితంగా ప్రవర్తించాడని తేలడంతో రిఫరీ జెఫ్ క్రో ఇషాంత్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఈ మ్యాచ్ లో స్లో ఓవరేట్ తో బౌలింగ్ చేసినందుకు ఆసీస్ జట్టుకు కూడా జరిమానా వడ్డించారు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు మ్యాచ్ ఫీజులో 60 శాతం, ఇతర ఆటగాళ్లకు 30 శాతం చొప్పున కోత విధించారు.

More Telugu News