Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుంటూరు టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత...ఎమ్మార్పీఎస్ కార్యకర్తల అరెస్ట్

గుంటూరులోని టీడీపీ కార్యాలయం వద్ద కొద్దిసేపటి క్రితం ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు టీడీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు కార్యాలయంలోని ఏపీ మంత్రులు రావెల కిశోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావులను కలిసేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

More Telugu News