‘రా’ చీఫ్ గా రాజీందర్ ఖన్నా...సీఆర్పీఎఫ్ డీజీగా ప్రకాశ్ మిశ్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘రా’ చీఫ్ గా రాజీందర్ ఖన్నా...సీఆర్పీఎఫ్ డీజీగా ప్రకాశ్ మిశ్రా

భారత గూఢచర్య సంస్థ ‘రీసర్చి అండ్ అనాలసిస్ వింగ్’ (‘రా’) చీఫ్ గా రాజీందర్ ఖన్నా నియమితులయ్యారు. సీఆర్పీఎఫ్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రకాశ్ మిశ్రా బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఆర్ఏఎస్)కు చెందిన 1978 బ్యాచ్ అధికారి అయిన రాజీందర్ ఖన్నా రెండేళ్ల పాటు 'రా' చీఫ్ గా కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 30 నుంచి ఖాళీగా ఉన్న సీఆర్పీఎఫ్ డీజీ బాధ్యతలు చేపట్టనున్న ప్రకాశ్ మిశ్రా, 1977 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సీనియర్ పోలీసు అధికారి. గతంలో ఒడిశా డీజీపీగా పనిచేసిన ఆయన మావోలపై ఉక్కుపాదం మోపారు. తాజాగా మావోల అణచివేతలో కీలక భూమిక పోషిస్తున్న సీఆర్పీఎఫ్ కు ఆయన చీఫ్ గా ఎంపికయ్యారు.

More Telugu News