జగన్ మాటలు వింటే మీ జాబులే పోతాయి: కాల్వ ఎద్దేవా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ మాటలు వింటే మీ జాబులే పోతాయి: కాల్వ ఎద్దేవా

ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం గందరగోళం నెలకొని ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేస్తుండడంతో, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు వారికి హితవు చెప్పారు. సభ సాఫీగా జరిగేందుకు సహకరించాలన్నారు. రుణమాఫీపై సభలో చర్చించాలని చెప్పిన మీరే ఇప్పుడు అడ్డుతగులుతుంటే ఎలా? అని ప్రశ్నించారు. అంతకుముందు జగన్... కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందన్నారని, కానీ, ఉన్న జాబులు పోతున్నాయని వ్యాఖ్యానించారు. నాలుగు రోజులుగా 15000 మంది కాంట్రాక్టు కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారని, అయినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు కాల్వ బదులిచ్చారు. జగన్ మాటలు వింటే వైఎస్సార్సీపీ సభ్యుల జాబులే పోతాయని ఎద్దేవా చేశారు.

More Telugu News