ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో 4జీ సేవలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో 4జీ సేవలు

ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రిలయన్స్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రిలయన్స్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో రిలయన్స్ కు సంబంధించిన 502 టవర్లు ఉన్నాయని, వాటిని 4జీగా అప్ గ్రేడ్ చేసేందుకు అనుమతివ్వాలని వారు సీఎంను కోరారు. దీంతో రిలయన్స్ కు 4జీ అనుమతులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1 నుంచి 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన రిలయన్స్ ప్రతినిధులకు సూచించారు.

More Telugu News