350 మంది అమ్మాయిలకు ముద్దు పెట్టా: కన్నడ నటుడు, మంత్రి అంబరీష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

350 మంది అమ్మాయిలకు ముద్దు పెట్టా: కన్నడ నటుడు, మంత్రి అంబరీష్

ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 350 మంది అమ్మాయిలకు ముద్దు పెట్టానని చెబుతున్నాడు కర్నాటక మంత్రి, సినీ నటుడు అంబరీష్. గతంలో ఓ అమ్మాయిని అంబరీష్‌ ముద్దుపెట్టిన ఫొటోపై ప్రతిపక్షాల ఆందోళన నేపధ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ బార్‌లో మందుకొట్టి, హిందీ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ అంబరీష్ కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. ఇది తన వ్యక్తిగతమని ఆయన వాదిస్తున్నారు. అయితే, ఇలా మందుకొట్టి మజా చేసే మంత్రి రూ.1.22 కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి సింగపూర్‌లో వైద్యం చేయించుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

More Telugu News