Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజీవ్ గాంధీ జాతకం రాయించాలని కోరిన నెహ్రూ... లేఖను బయటపెట్టిన బీజేపీ

ఇందిరాగాంధీకి పుత్రోదయం కాగానే, బాబు పూర్తి జాతకాన్ని రాయించాలని అప్పటి ప్రధాని నెహ్రూ కోరారట. ఈ మేరకు ఆయన రాసిన లేఖను బీజేపీ విడుదల చేసింది. జ్యోతిష్య విద్యను అభ్యసించడం వృథా అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ లేఖను బయటకు తేవడం గమనార్హం. 1944లో ఆగస్టు 29వ తేదీతో ఉన్న ఈ లేఖను కృష్ణ హుతీసింగ్ అనే వ్యక్తికి నెహ్రూ రాసారు. బిడ్డ పుట్టిన కచ్చితమైన సమయాన్ని రికార్డు చేయాలని, పూర్తి జాతకం తయారుచేయాలని కోరారు. ఇదే విధమైన లేఖను ఇందిరా గాంధీకి కూడా ఆయన రాసారట. ఇటీవల కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని ఓ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళడం, ఆ పై ప్రతిపక్షాలు దీన్ని ఖండిస్తూ, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జ్యోతిష్యాన్ని నమ్మడం శాస్త్రీయ దృక్పథానికి దూరమని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో, హేతువాదిగా పేరు తెచ్చుకున్న నెహ్రూనే జాతకం కోరాడని బీజేపీ సాక్ష్యం తేవడంతో, కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

More Telugu News