Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పులుపుతో రక్తవృద్ధి!

పుల్లగా ఉండే ఫలాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిమ్మ, ఉసిరి, జామ, ఆపిల్ వంటి ఫలాల్లో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. రక్తం వృద్ధి చెందడానికి విటమిన్ సి ఎంతో దోహదం చేస్తుంది. చాలా మంది పులుపును తక్కువగా ఇష్టపడతారు. అది సరికాదంటున్నారు నిపుణులు. రక్తం తక్కువైన సందర్భాల్లో డాక్టర్లు ఐరన్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలని సూచించడం తెలిసిందే. అయితే, మనం తీసుకున్న ఐరన్ రక్తవృద్ధికి తోడ్పడాలంటే విటమిన్ సి సాయం తప్పనిసరి. విటమిన్ సి లేకపోతే మనం స్వీకరించే ఐరన్ తగిన మోతాదులో శరీరానికి అందదు. దాంతో, రక్తవృద్ధి సాధ్యం కాదంటున్నారు నిపుణులు. విటమిన్ సి లోపిస్తే రక్తం గడ్డడం చాలా ఆలస్యమవుతుంది. అంతేగాకుండా, రక్తహీనత కలిగి నీరసం వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. భారత్ లో 70 శాతం మంది విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారట.

More Telugu News