Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీకి కౌంటర్ వేసిన ఝార్ఖండ్ సీఎం

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విమర్శల దాడులు కొనసాగుతున్నాయి. అధికారం నుంచి దొంగలను తరిమికొట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వగా, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ దీటుగా స్పందించారు. బీజేపీ ఓ దొంగల పార్టీ అని విమర్శించారు. పకూర్, మహశ్ పూర్ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో మాట్లాడిన సందర్భంగా సొరెన్ బీజేపీని దుయ్యబట్టారు. వారి కన్ను ఝార్ఖండ్ లోని ఖనిజ లవణ నిక్షేపాలపై పడిందని ఆరోపించారు. రాష్ట్రం వెలుపలి వ్యక్తులకు వాటిని అప్పగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పైనా ఆయన బాణాలు ఎక్కుపెట్టారు! కాంగ్రెస్ గిరిజనులను మోసం చేసిందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవకాశవాద పార్టీలని విమర్శించారు. అందుకే, రాష్ట్రాభివృద్ధి కోసం జేఎంఎంకు మద్దతివ్వాలని సొరెన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు, దుమ్కాలో జరిగిన తన ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, బీజేపీకి మూడింట రెండు వంతుల మెజారిటీ కట్టబెట్టాలని, దొంగలను పారదోలాలని అధికార జేఎంఎం పార్టీనుద్దేశించి వ్యాఖ్యానించారు.

More Telugu News