ఆస్ట్రేలియా వెళ్లనున్న బీసీసీఐ సెక్యూరిటీ చీఫ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్ట్రేలియా వెళ్లనున్న బీసీసీఐ సెక్యూరిటీ చీఫ్

సిడ్నీలోని ఓ కేఫ్ లో ఇరాన్ కు చెందిన ఓ మతగురువు కొందరు పౌరులను బందీలుగా పట్టుకున్న ఘటన పలు దేశాలను ఆందోళనలో పడేసింది. ముఖ్యంగా, భారత్ కు చెందిన ఇద్దరు పౌరులు కూడా బందీల్లో ఉండడంతో ఎన్డీయే సర్కారు చురుగ్గా స్పందించింది. అటు, భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో, బీసీసీఐ కూడా దీనిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో, భారత జట్టుకు కల్పిస్తున్న భద్రతను పర్యవేక్షించేందుకు బీసీసీఐ భద్రత, అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవి సవానీని ఆస్ట్రేలియా పంపుతున్నారు. ఈ రాత్రికి సవానీ ఆస్ట్రేలియా బయల్దేరతారని, ఆస్ట్రేలియన్ హైకమిషన్ ఆయనకు వెంటనే వీసా మంజూరు చేేసేందుకు అంగీకరించిందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మీడియాకు తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ ఆటగాళ్ల భద్రతపై భరోసా ఇచ్చారని, అయితే, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు మనవంతుగా సవానీని ఆస్ట్రేలియా పంపుతున్నామని పటేల్ వివరించారు. సవానీ టీమిండియా భద్రతపై స్థానిక భద్రతా సంస్థలతో చర్చిస్తారని చెప్పారు.

More Telugu News