తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ జ్యుడీషియల్ రిమాండ్ ను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి అరవింద్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. శారదా చిట్ ఫండ్ కంపెనీ యజమాని సుదీప్త సేన్, అతని సహాయకుడు దేబ్జాని ముఖర్జీ రిమండ్ ను కూడా పొడిగించారు. రిమాండ్ ను పొడిగించాలని సీబీఐ కోరిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News