సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా, నూతన సంప్రదాయానికి ప్రధాని శ్రీకారం చుట్టారని బాబు కొనియాడారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ప్రధాని ఆలోచించారని వివరించారు. స్వాతంత్ర్యానంతరం చాలాకాలం తర్వాత దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాతే అభివృద్ధికి నోచుకున్నామని అన్నారు. అయితే, ఈ పదేళ్లలో దేశంలోని వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని అన్నారు.
ఇన్నాళ్లు ప్రణాళిక సంఘం తీరు ఓ ప్రహసనంలా ఉండేదని, దిశాదశా నిర్దేశించే పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘం మధ్య సమన్వయం ఉండేది కాదన్నారు. వ్యవస్థలో లోపాల వల్ల నిర్ణయాలు తీసుకోలేకపోయారని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మారే సమయం ఆసన్నమైందని తెలిపారు. అనుభవం ఉన్న వ్యక్తి ప్రధాని అయ్యారని, రాష్ట్ర పాలనలో అనుభవం ఉన్న వ్యక్తి కూడా కావడం లాభించే అంశమని అన్నారు. పరిస్థితులను ఆయన అంచనా వేస్తున్నారని తెలిపారు. రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యమని, దేశం కోసం ప్రణాళికలు తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రణాళిక సంఘం స్థానంలో ముఖ్యమంత్రుల మండలి ఉండాలని బాబు పేర్కొన్నారు.
తాను సింగపూర్, జపాన్ దేశాల్లో పర్యటించిన సందర్భంగా ప్రజల్లో ఎదుగుదల పట్ల ఆసక్తిని గమనించానని, మనం కూడా ఆ తరహాలో విజన్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. విజన్ 2050తో ముందుకు వెళ్లాలని, అది సాకారమైతే, మరో 35 ఏళ్లలో మనదేశం ప్రపంచంలో ఒకటో స్థానంలోనో, లేక, రెండో స్థానంలో ఉంటుందని అభిప్రాయపడ్డారు.
More Telugu News
-
భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు