విశాఖ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ వేసిన ప్రశ్నలపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జగన్ కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదన్నారు. పార్టీ నుంచి జారిపోతున్న నేతలను కాపాడుకునేందుకే జగన్ ధర్నా చేశారని ఆయన విమర్శించారు.
హుదూద్ తుపాను టైంలో సహాయకచర్యలు అందలేదని ఆయన పేర్కొనడంపై మంత్రి దుమ్మెత్తిపోశారు. హుదూద్ సమయంలో 64 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి ఏం చేశారో విశాఖవాసులందరికీ తెలుసని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాలో పార్టీ శ్రేణులు తప్ప రైతులు పాల్గొన్నారా? అని ఆయన ప్రశ్నించారు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉండి కూడా రుణమాఫీ చేశామని ఆయన సూచించారు.
తెలంగాణలో వైఎస్సార్సీపీ జెండా పీకేశారని, పార్టీ కార్యాలయం ఎక్కడుందో జగన్ చిరునామా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రవ్యతిరేక ప్రచారంపై జగన్ ఏనాడైనా ఒక్క మాట మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యతిరేక వ్యాఖ్యలు, పనులు చేస్తున్నా కేసీఆర్ ను తప్పుపట్టే ధైర్యం జగన్ కు లేదని ఆయన విమర్శించారు.
More Telugu News
-
భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు